పశువులు అక్రమంగా తరలిస్తున్న ముఠా అరెస్ట్
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నుంచి పశువులను మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల గుండా కొచ్చిన్‌కు తరలించే అంతర్రాష్ట్ర పశువుల అక్రమ రవాణా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఇమ్రాన్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర గాడ్చందూర్‌కు చెందిన ఇమ్రాన్ బాబు షేక్, ఇచ్చోడకు చెందిన మొహమ్మద్ జాకిర్‌లు ఇచ్చోడ మార్కెట్‌లో 16 ఎద్దులను కొనుగోలు చేసి, అదనంగా మూడు ఎద్దులను దొంగిలించి అక్రమంగా కొచ్చిన్ తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు బుధవారం రోల్‌మామడ టోల్‌ప్లాజా వద్ద వాహనాన్ని ఆపి నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లో పశువులను కొనుగోలు చేసి, కొన్నింటిని దొంగతనం చేసి మొహమ్మద్ ఇమ్రాన్‌కు చెందిన వాహనంలో అనంతపూర్ మార్గం గుండా కొచ్చిన్‌లోని మహేంద్రత్రిమూర్తి వద్దకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అక్రమ రవాణాకు సఫాన్ హనీఫ్ సేథ్, అస్లాం, మెహబూబ్ అలీ ఖురేషి అనే వ్యక్తులు మద్దతు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఇందులో భాగస్వాములైన 8 మందిని రిమాండ్‌కు తరలించామని, ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.


