కన్నుల పండువగా మల్లన్నస్వామి కల్యాణం
జైపూర్: మండల కేంద్రంలోని వెలిశాల మల్ల న్న స్వామి ఆలయంలో బుధవారం కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని మల్లన్నస్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. చెన్నూర్‌కు చెందిన పోటు ప్రతాప్‌రెడ్డి, దేవేంద్ర ఆధ్వర్యంలో ఒగ్గు పూజారులతో సంప్రదాయబద్దంగా మల్లన్నస్వామిభ్రమరాంభికలకు పెద్దపట్నం వేసి కల్యాణం జరిపించారు. ఒగ్గు పూజారుల ఢమరుక మోతలతో అటవీప్రాంతం మార్మోగింది. కల్యాణాన్ని వీక్షించడానికి సమీప ప్రాంతాల్లోని భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సందడిగా మారింది. భక్తులు బోనాలు పోసి, పట్నాలు వేసి మొక్కలు చెల్లించారు.


