జాతీయస్థాయి పోటీలకు కాసిపేట విద్యార్థి
కాసిపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థి తెల్కపల్లి శివ జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు కళాశాల పీడీ బాబురావు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో నిర్వహిస్తున్న 69వ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అండర్–19 విభాగంలో 5వేల మీటర్లు, 6కిలోమీటర్ల పరుగు పందెం పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చారని తెలిపారు. ద్వితీయ స్థానం సాధించడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. శివను కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, డీఐఈవో అంజయ్య, హెచ్‌ఎఫ్ సెక్రెటరీ బాబురావు అభినందించారు.


