ఎక్సైజ్ స్టేషన్‌లో కానిస్టేబుళ్ల పేకాట
చెన్నూర్: చెన్నూర్ ఎకై ్సజ్ పోలీసుస్టేషన్ పేకాటకు అడ్డాగా మారింది. గుడుంబా, అక్రమ, కల్తీ మద్యాన్ని నియంత్రించాల్సిన పోలీసులు విధులు విస్మరించి పేకాటలో నిమగ్నయ్యారు. చెన్నూర్‌కు డిప్యూటేషన్‌పై వచ్చిన ఎస్సై గత నెల రోజులుగా మద్యం దుకాణాల టెండర్లు ఉండడంతో మంచిర్యాల సూపరింటెండెంట్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్సై, సీఐ కార్యాలయంలో లేకపోవడంతో మంగళవారం రాత్రి స్టేషన్ మూసి వేసి పేకాట ఆడారు. ఎకై ్సజ్ స్టేషన్ చెన్నూర్‌కు దూరంగా జాతీయ రహదారి పక్కనే ఉంది. రాత్రి సమయంలో వాహనాల రాకపోకలు తప్ప జనసంచారం ఉండదు. స్టేషన్ తలుపులు మూసేస్తే లోపల ఏం జరుగుతుందో బయటకు తెలియదు. స్టేషన్‌లో అధికారులు, జన సంచారం లేకపోవడంతో కానిస్టేబుళ్లు పేకాట ఆడుతున్నారని సమాచారం. గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందని జోరుగా చర్చించుకుంటున్నారు. ఎకై ్సజ్ స్టేషన్ కావడంతో పోలీసులు సైతం రారనే ఉద్దేశంతోనే ఎకై ్సజ్ హెడ్ కానిస్టేబుల్‌తోపాటు కానిస్టేబుళ్లు పేకాట జోరుగా సాగిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై చెన్నూర్ ఎకై ్సజ్ సీఐ హరిని సంప్రదించగా.. మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నానని, ఏనాడూ తన దృష్టికి రాలేదని, నిన్న రాత్రి పేకాట ఆడుతున్న విషయం తెలిసింది అన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


