ఇవేం కొర్రీలు..
నాకున్న సొంత భూమితోపాటు మరో పదిహేను ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేసిన. వానలకు కొంత దెబ్బతింది. ఇంకొంత మంచిగ ఉంది. సీసీఐ పోయినేడు తేమశాతం ఎక్కువ వస్తుందని కొనుగోలు చేసేందుకు కొర్రీలు పెట్టింది. ఈయేడు ఫోన్లలో పేరు, ఏమేమో ఎక్కించుకోవాలని చెప్తున్నరు. ఎకరానికి ఏడు క్వింటాళ్లు కొంటారట.. ఇవేం కొర్రీలు. పోయినేడాది కంటే కొంత ధర పెరిగిందనుకుంటే గిట్ల తిరకాసులు పెడుతున్నరు. కొర్రీలు లేకుండా కొనాలే.
– అక్కెపెల్లి చిన్నయ్య, గ్రామం: కొత్తగూడెం, మం: నెన్నెల
కనీసం పది క్వింటాళ్లు కొనాలి
ఈ ఏడాది 14ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేసిన. ఇప్పుడిప్పుడే పంట చేతికి వస్తుంది. ఏడు క్వింటాళ్లే కొంటాం అంటున్నారు. ఎక్కువ ఎళ్లింది ఎక్కడ అమ్ముకుని నష్టపోవుడు. దిగుబడి ఎక్కువ వస్తే ఇంత లాభం ఉంటుందని అనుకుంటే గిట్ల తిరకాసులు పెడుతున్నరు. కనీసం ఎకరానికి పది క్వింటాళ్ల వరకై నా కొనుగోలు చేయాలి.
– కొండ బాపు, కౌలు రైతు, వేమనపల్లి
ఇవేం కొర్రీలు..


