యంత్రాల పని గంటలు పెంచాలి
శ్రీరాంపూర్: ఓపెన్ కాస్ట్ గనిలో భారీ యంత్రాల పని గంటలను మరింత పెంచాలని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ తెలిపారు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో బుధవారం రూ.1.51కోట్లు విలువైన హైడ్రాలిక్ షవల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ యంత్రం ద్వారా రోజుకు 8500క్యూబిక్ మీటర్ల మట్టిని తీయగలుగుతామన్నారు. ఇలాంటి భారీ యంత్రాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే అనుకున్న ఫలితా లు సాధిస్తామని తెలిపారు. గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, ఏరియా ఇంజనీర్ సాంబశివరావు, ఓిసీపీ అధికారి చిప్ప వెంకటేశ్వర్లు, గని మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


