అత్యవసరం మేరకే అంబులెన్స్ సేవలు
వేమనపల్లి: అత్యవసర పరిస్థితుల్లోనే 108 అంబులెన్స్ వైద్య సేవలను వినియోగించుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 108 అంబులెన్స్ వాహనాల ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో అంబులెన్స్ వాహన పనితీరును ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య పరికరాలు, మందులు, అత్యవసర మెడికల్ సామగ్రి పరిశీలించారు. ఎటువంటి రోడ్డు ప్రమాదాలకై నా అంబులెన్స్ ఉపయోగించుకోవాలని తెలిపారు. సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. అంబులెన్స్‌లో సుఖప్రసవం నిర్వహించిన సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా 108 వాహనాల కార్యనిర్వహణ అధికారి సంపత్, ఈఎంటీ స్వరూప్, పైలట్ సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.


