టాటామ్యాజిక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్
నర్సాపూర్(జి): మండలంలోని రాంపూర్ గ్రామ శివారు 61వ జాతీయ రహదారిపై మంగళవారం టాటామ్యాజిక్‌ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపి న వివరాల మేరకు.. మామడ మండలం కొరటికల్‌కు చెందిన 11 మంది టాటా మ్యాజిక్‌లో భైంసా మండలంలోని కామోల్ గ్రామానికి అంత్యక్రియలకు వెళ్లారు. తిరుగుప్రయాణంలో రాంపూర్ శివారులో నర్సాపూర్(జి) నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న ట్రాక్టర్ అతివేగంగా వచ్చి టాటా మ్యాజిక్‌ను ఢీకొట్టింది. ఘటనలో టాటా మ్యాజిక్ వాహనం ముందుభాగం పూర్తిగా దెబ్బతినడంతో డ్రైవర్ రాజేశ్వర్ (50), పక్కన కూర్చున్న చిన్నారెడ్డి క్యాబిన్లో ఇరుక్కుపోయారు. ట్రాక్టర్ డ్రైవర్ శంకర్ భార్య కిందపడడంతో చేయి విరిగింది. గమనించిన స్థానికులు రాజేశ్వర్, చిన్నారెడ్డిని బయటకు తీసి 108కు సమాచారం అందించగా నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజేశ్వర్ మృతి చెందాడు. మృతుని కుమారుడు సంజీవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ..
ఎస్పీ జానకీ షర్మిల సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు.
టాటామ్యాజిక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్


