ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
కుంటాల: తన ఇంటినిర్మాణానికి చేసిన అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపానికి గురై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల మేరకు కుంటాలకు చెందిన పూర్ణం అడెల్లు (44) ఇటీవల కొత్తగా ఇంటిని నిర్మించుకున్నాడు. ఇందుకు రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. తీర్చేమార్గం కనిపించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. తల్లి పోసాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
మద్యానికి బానిసై ఆర్‌ఎంపీ..
లక్ష్మణచాంద: ఆర్‌ఎంపీ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని బాబాపూర్ గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు మాలెపు రాజు(39) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల అతని భార్య మూడో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని భార్య చందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య


