మృత్యు మార్గాలు!
జిల్లాలో రక్తమోడుతున్న రహదారులు నాలుగేళ్లలో 500కు పైగా మరణాలు బాధితుల్లో ఎక్కువమంది యువకులే నిబంధనల ఉల్లంఘనతోనే ఘటనలు బాధిత కుటుంబీకుల్లో తీరని దుఃఖం
సాక్షి ప్రతినిధి మంచిర్యాల: రోడ్డు ప్రమాదాలు కు టుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. చిన్నపాటి అజాగ్రత్తతో ప్రాణాలు గాల్లో కాలుస్తున్నాయి. ప్ర మాదాల్లో తీవ్ర గాయాలపాలైన వారు జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లాలో ఏటా ప్ర మాదాల తీవ్రత పెరుగుతూ వస్తోంది. మితి మీరిన వేగం, రహదారి భద్రత నియమాల ఉల్లంఘనతోనే అధికంగా నష్టం జరుగుతోంది. గత నాలుగేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 500కు పైగా తమ విలువైన జీవితాలను కోల్పోయారు. ఈ ప్రమాదాలు ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపాయి.
ఎక్కువ శాతం యువతే..
రోడ్డు ప్రమాదాల్లో అధికంగా 18నుంచి 40ఏళ్లలోపు వారే మరణించడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని సార్లు మైనర్లు తీవ్రంగా గాయపడడం, మరికొంద రు ప్రాణాలు కోల్పోవడమూ జరుగుతోంది. జిల్లాలో క్రమంగా రోడ్ల పరిస్థితి మెరుగవుతోంది. మంచి ర్యాల, చంద్రాపూర్ ఎన్‌హెచ్ 363, లక్సెట్టిపేట, చెన్నూరు, సిరొంచ వైపు ఎన్‌హెచ్ 63 ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్రీయ రహదారులైన మంచిర్యా ల, లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం, బాసర, ఆది లాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలను కలిపే రోడ్లపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
సమష్టిగా పని చేస్తేనే..
రోడ్డు భద్రతలో ఆయా స్టేషన్ల పరిధిలో పోలీస్ అధి కారులే బాధ్యత తీసుకుంటున్నారు. అయితే రవా ణాశాఖ, రోడ్డు నిర్వహణ పర్యవేక్షించే గ్రామీణ, రాష్ట్ర, నేషనల్ హైవేస్ ఇంజినీర్ల భాగస్వామ్యం మ రింత పెరగాల్సి ఉంది. రోడ్డు నిర్మాణంలో సాంకేతిక లోపం నుంచి వాహనదారులు భద్రత నియమాలు పాటించేలా రవాణాశాఖ అధికారులు చూ డాల్సి ఉంది. కానీ, పోలీస్ అధికారులు మాత్రమే ప్రమాదాల నివారణకు శ్రమించాల్సి వస్తోంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాద మరణాలను అరికట్టవచ్చని అధికారులు సూచిస్తున్నా రు. రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్ వద్ద ని, రోడ్డుపై ఎల్లప్పుడు దారికి ఎడమవైపు వాహనం నడపాలని, హైవేలపై భారీ, అతిభారీ వాహనాలు వెళ్లే లేన్లను సైడ్ మిర్రర్లలో చూస్తూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు తగ్గే అవకాశముంది. సర్వీస్ రోడ్డు, యూటర్న్ దూరంగా ఉందని, రాంగ్ రూట్‌లో వెళ్లొ ద్దు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలతో సామర్థ్యానికి మించి వాహనాలపై ఓవర్ స్పీడ్‌తో వెళ్లకూడదు. ప్ర మాదం జరిగితే ఆర్థికంగా నష్టపోకుండా తప్పనిసరిగా వ్యక్తిగత, వాహన బీమా తీసుకోవాలి.
ప్రమాదాలు అధికంగా జరిగే చింతగూడ, మహ్మదాబాద్ గ్రామాల మధ్య రోడ్డు
ఆ రహదారిపైనే అధికం
జిల్లాలో అధికంగా లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం, బాసరకు వెళ్లే మార్గంలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్గం అటవీ ప్రాంతం గుండా వెళ్లడం, రో డ్డు ఇరుకుగా ఉండడమే ఇందుకు కారణం. మధ్యలో డివైడర్లు లేకపోవడంతో వాహనదా రులు ఇష్టరీతిన రాకపోకలు సాగిస్తున్నారు. వీటితోపాటు జిల్లా కేంద్రం, బెల్లంపల్లి శివా రు, కన్నాల, తాండూరు, చెన్నూరు వైపు ప్ర మాదాలు జరుగుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న జిల్లా ఉత్తరభారత దేశానికి అనుసంధానం కావడంతో బొగ్గు, సిమెంట్, సిరామిక్, మట్టి ముడి సరుకులతో వందలాది భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోడ్డు విస్తరణ పెరగడంతో వాహనాల వేగమూ పెరిగి అదుపు తప్పుతుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
మృత్యు మార్గాలు!


