‘వేగానికన్నా ప్రాణమే మిన్న’
లక్సెట్టిపేట: వేగానికన్నా ప్రాణమే చాలా వి లువైందని డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని శ్రీనివాస గా ర్డెన్ ఫంక్షన్ హాల్‌లో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత అవగా హన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో చాలా కుంటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 142 రోడ్డు ప్రమాదాలు జరిగా యని పేర్కొన్నారు. వాహనదారులు తప్పని సరిగా నిబంధనలు పాటించాలని, ధ్రువీకరణ పత్రాలు, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూ చించారు. కొన్ని రోడ్డు ప్రమాద ఘటనలు చూసి చలించిన తాను స్వయంగా పాటలు రాసి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. అనంతరం గ్రామ కమిటీ సభ్యులతో ప్రతిజ్ఞ చేయించా రు. శివసాయి గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో అందించిన హెల్మెట్లను పలువురికి పంపిణీ చేశారు. ఏసీపీ ప్రకాశ్, సీఐ రమణమూర్తి, మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్, ఎ స్సైలు సురేశ్, తైసొద్దీన్, అనూష, అదనపు ఎ స్సై రాములు, ఏఎంవీఐ సూర్యతేజ, కానిస్టేబుళ్లు, యువకులు, డ్రైవర్లు పాల్గొన్నారు.


