42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

Nov 5 2025 7:19 AM | Updated on Nov 5 2025 7:19 AM

42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

మంచిర్యాలటౌన్‌: విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్‌ను 42శాతానికి పెంచుతూ ఆమోదించిన బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే చర్యలు చేపట్టేలా చూడాలని బీసీ రిజర్వేషన్‌ సాధన సమితి నాయకులు మంగళవారం అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్యకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలు ఏ ర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. రాబోయే శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశా రు. 42శాతం రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేయాల ని, అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యా యం జరిగేలా చూడాలని కోరారు. బీసీ మేధావుల ఫోరం ఉమ్మడి జిల్లా చీఫ్‌ కోఆర్డినేటర్‌ శ్రీరామోజు కొండయ్య, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్‌ రంగు రాజేశం, నాయకులు జయరావు, షబ్బీర్‌ పాషా, యాదగిరి, రాజు, రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement