రైతులు సేంద్రియ సాగుపై దృష్టి సారించాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రైతులు సేంద్రియ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని జి ల్లా వ్యవసాయాధికారి సురేఖ సూచించారు. మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట రైతువేదికలో నిర్వహించిన రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు రైతులకు భూసార పరీక్షా ఫలితాల సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భూసారం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. సమగ్ర ఎరువుల యాజమాన్యం ద్వారా భూమిలో స్థూల, సూక్ష్మ పోషకాల సమతుల్యతను కా పాడుకోవాలని తెలిపారు. భూమి తేమ నిల్వ ఉండాలంటే సేంద్రియ ఎరువులు, పశువుల పేడ వేయాలని, వానపాముల ఎరువులు వా డాలని సూచించారు. పచ్చిరొట్ట, జీవన ఎరువులు వాడకాన్ని పెంచితే రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించవచ్చని తెలిపారు. కా ర్యక్రమంలో ఏడీఏలు మామిడి కృష్ణ, డీఏవో గోపి, ఏవోలు కృష్ణ, తరుణ్, ఫర్హీన్, ఏఈవో ప్రసన్న, రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ పూస్కూరి శ్రీనివాసరావు, డైరెక్టర్ బొడ్డు శంకర్, స్థానిక రైతులు దొమ్మడి సత్తయ్య, రాజ మౌళి, ఆకిరెడ్డి రాజయ్య, అప్పనని సత్తి, భూ మయ్య, పోచయ్య పాల్గొన్నారు.


