మత్స్యకారుల అభివృద్ధికి కృషి
లక్సెట్టిపేట: మత్య్సకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నా రు. మంగళవారం మండలంలోని గుల్లకోట గ్రా మంలో మత్య్సకారులకు చేపపిల్లలు పంపిణీ చేశా రు. గోదావరి నదిలో చేపపిల్లలు వదిలారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత సంవత్సరానికి 223.93 లక్షల చేప పిల్లలు పెంచేందుకు ప్ర తిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని చెరువుల్లో చేపపిల్లలు వదలనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య మత్య్సకారులు, నాయకులు పాల్గొన్నారు.
గుల్లకోటలో కొనుగోలు కేంద్రం ప్రారంభం
మండలంలోని గుల్లకోటలో లక్ష్మీప్రసన్న గ్రామ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొ నుగోలు కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ప్రేమ్‌చంద్, వైస్ చైర్మన్ ఎండీ ఆరీ ఫ్, తహసీల్దార్ దిలీప్‌కుమార్, కాంగ్రెస్ మండలా ధ్యక్షుడు పింగిలి రమేశ్, నాయకులు దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలి
మంచిర్యాల అగ్రికల్చర్: రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పత్తి కొనుగోలు చేయాలని కలెక్టర్ కుమా ర్ దీపక్ సూచించారు. కలెక్టరేట్‌లో అధికారులు, జి న్నింగ్ మిల్లుల యజమానులతో పత్తి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కపాస్ కిసాన్ యా ప్‌లో రైతులు తమ వివరాలు నమోదు చేసుకుని, పత్తి విక్రయానికి స్లాట్ బుక్ చేసుకునేలా అవగాహ న కల్పించాలని సూచించారు. ఈసారి ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 స్థాయిల్లో స్లాట్ బుకింగ్ జరుగుతోందని, ఎల్ 1లో 75శాతం స్లాట్ బుకింగ్ తర్వాత ఎల్ 2 ఓపెన్ అవుతుందని, ఎల్ 2లో 75 శాతం స్లాట్ బుకింగ్ తర్వాత ఎల్ 3 ఓపెన్ అవుతుందని తెలిపా రు. లక్సెట్టిపేట, బెల్లంపల్లి, తాండూర్ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు త్వరగా ఏర్పాటు చేసేలా చ ర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, జిల్లా మార్కెటింగ్ అధికారి ష హబుద్దీన్, విద్యుత్‌శాఖ అధికారి ఉత్తమ్ ఉన్నారు.
గూడెంలో జాతర ఏర్పాట్లపై ఆరా
దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించనున్న కార్తీక జాతర ఏర్పాట్లను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇ బ్బందులకు గురి కాకుండా అన్ని వసతులు కల్పించాలని ఆలయ అధికారులకు సూచించారు. సత్యదేవున్ని దర్శించుకున్న తర్వాత కలెక్టర్‌ను వేదపండితులు ఆశీర్వదించి లడ్డూ ప్రసాదం అందించారు. అనంతరం జాతర ఏర్పాట్లపై ఆలయ ఈవో శ్రీని వాస్, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
హాస్టల్ భవనం పరిశీలన
మండలంలోని ద్వారక జెడ్పీ ఉన్నత పాఠశాల స మీపంలో చేపట్టిన బీసీ బాలుర వసతిగృహ భవన నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్‌దీపక్ పరిశీలించారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అ ధికారులను ఆదేశించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజన ప థకం నిర్వహణ తీరు గురించి తెలుసుకున్నారు.


