బకాయిలు చెల్లించాలని నిరసన
మంచిర్యాలఅర్బన్: పెండిగ్ స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర బంద్‌లో భాగంగా రెండోరోజు మంగళవారం మంచిర్యాలలో డిగ్రీ, పీజీ కళా శాలల యాజమాన్యాలు, అధ్యాపకులు నిరసన తె లిపారు. స్థానిక ఐబీ చౌరస్తాలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా డిగ్రీ, పీజీ కళాశాలల అసో సియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేయకపోవడంతో అప్పులు తీసుకువచ్చి నెట్టుకువస్తున్నామని తెలిపారు. వేతనాలు, భవన యజమానులకు అద్దె చెల్లించలేక ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళికి నిధులు విడుదల చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కళాశాలల బంద్ చేపట్టినట్లు తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నర్సయ్య, సభ్యులు, క రస్పాండెంట్లు పల్లె భూమేశ్, ఉదారి చంద్రమోహన్‌గౌడ్, శ్రీకర్, మనోహర్‌రెడ్డి, ఆర్.శ్రీనివాస్, మల్లేశ్, శ్రీధర్‌రావు, విజయ్‌కుమార్ తదితరులున్నారు.


