సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
నస్పూర్: సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా వైద్యాధికారి అనిత సూచించారు. మంగళవా రం ఆమె నస్పూర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆశ కా ర్యకర్తలు ఇంటింటికీ తిరిగి సేవలందించడంలో ముందుండాలని, ప్రతీ గర్భిణి వివరాలు నమోదు చేయాలని సూచించారు. టీకాలు ఇప్పించడం, ప్ర భుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవం అయ్యేలా చూ డాలని పేర్కొన్నారు. ప్రజలకు వ్యాధులపై అవగా హన కల్పించాలని తెలిపారు. ఆశ కార్యకర్తలు ప్రజ లతో సమన్వయం చేసుకుంటూ వారు రోగాల బా రిన పడకుండా చూడాలని, పాఠశాలల్లో విద్యార్థులకు ఆర్పీఎస్‌కే టీం ద్వారా పరీక్షలు చేయించడంపై అవగాహన కల్పించాలని సూచించారు. నస్పూర్ మెడికల్ ఆపీసర్ వెంకటేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
మెరుగైన సేవలందించాలి
జైపూర్: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి అనిత సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆశ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. హైరిస్క్ గర్భిణుల వివరాలు వైద్యాధికారికి తెలుపాలని పేర్కొన్నారు. షోషకాహార లో పంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి వివరాలు అంగన్‌వాడీలకు అందించాలని సూచించారు.


