‘ఎమ్మెల్యే మాటలు విని దుకాణాలు కూలుస్తారా..?’
బెల్లంపల్లి: ఎమ్మెల్యే మాటలు విని దుకాణాలు కూలగొట్టడం ఏం అభివృద్ధి అని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రశ్నించారు. సోమవా రం ఆయన పట్టణంలోని బీఆర్ అంబేడ్కర్(కాంటా) చౌరస్తా వద్ద కూల్చివేతకు గురైన దుకాణాలను బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా దుకాణాలు కూల్చి వేసి రోడ్డుపాలు చేశారని నిరాశ్రయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిన్నయ్య సెల్‌ఫోన్‌లో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్‌తో మాట్లాడా రు. విస్తరణ పనులకు ముందు దుకాణాల నిర్వాహకులతో ఎందుకు మాట్లాడలేక పోయారని అన్నా రు. ఎమ్మెల్యే మాటలు విని పేదలను ఇబ్బందులకు గురి చేయడం తగదని అన్నారు. 1200 కుటుంబా లు వీధిన పడుతున్నాయని, ఆ కుటుంబాలకు ఏ హానీ జరిగినా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంద ని పేర్కొన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్‌ఎస్ పట్ట ణ అధ్యక్షుడు సత్యనారాయణ, బీఆర్‌ఎస్ నాయకులు ,శ్రేణులు ఎల్.రాము, ఇ.సుందరరావు, హనీఫ్ పాల్గొన్నారు.


