‘అమ్మకు అక్షరమాల’ విజయవంతం చేయాలి
జన్నారం: ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అమ్మకు అక్షరమాల కార్యక్రమం విజయవంతం చే యాలని జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి అజ్మీ ర పురుషోత్తం అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో అమ్మకు అక్షరమాల కార్యక్రమం విజయవంతంలో భాగంగా నియమించిన ఇద్దరు ఓబీ(ఆఫీస్ బేరర్), ఒక వీఓఏ(విలేజ్ ఆర్గనైజ్ అసిస్టెంట్)లకు శిక్షణ ఇ చ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నిరక్షరాస్యులకు చదువు నేర్పించనున్న ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ మనోహర్‌రెడ్డి, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఐకేపీ ఏపీఎం లలిత, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వరలక్ష్మి, సీఆర్పీలు రజిత, స్వప్న, వయోజన విద్యాశాఖ డీఆర్పీ సుమన్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న విద్యాశాఖ అధికారి పురుషోత్తం


