చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..! | - | Sakshi
Sakshi News home page

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!

Nov 4 2025 7:06 AM | Updated on Nov 4 2025 7:36 AM

మహిళా క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ గెలిచిన భారత జట్టు టీమిండియాపై ప్రశంసలు ఆదర్శంగా తీసుకుంటామంటున్న క్రీడామణులు

అండర్‌19లో ఆడుతున్నా..

మంచిర్యాలటౌన్‌: మహిళా క్రికెట్‌ జట్టు ప్రపంచ కప్‌ను గెలిచి ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. నేను క్రికెట్‌లో శిక్షణ పొంది, అండర్‌ 19 విభాగంలో జాతీయస్థాయిలో ఆడుతున్నాను. ప్రపంచకప్‌ను సాధించిన మహిళా క్రికెట్‌ జట్టుతనలాంటి వారెందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది.

– సుచరిత, చెన్నూరు

శిక్షణ తీసుకుంటున్నా..

మంచిర్యాలటౌన్‌: మహిళా క్రికెట్‌ జట్టు ప్రపంచ కప్‌ విజేతగా నిలవడంతో చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే ఇష్టంతో మంచిర్యాలలోని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ వారి వద్ద క్రికెట్‌లో శిక్షణ పొందుతున్నాను. గత ఏడాది అండర్‌ 17 బాలికల విభాగంలో హర్యానాలో జరిగిన జాతీయస్థాయి క్రికెట్‌లో ఆడాను.

– సంజన, టేకుమట్ల,

మం.జైపూర్‌

క్రికెట్‌లో రాణిస్తా..

మంచిర్యాలటౌన్‌: క్రికెట్‌లో రాణించాలన్న కోరికతో శిక్షణ తీసుకుంటున్నా. ఇప్పటి వరకు నా సీనియర్లు క్రికెట్‌లో శిక్షణ పొంది జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. మన దేశ మహిళా క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ను సాధించడంతో మరింత ఉత్సాహం వచ్చింది. నేను కూడా జాతీయ స్థాయిలో రాణిస్తా.

– అక్షర, 8వ తరగతి,

జెడ్పీఎస్‌ఎస్‌, జైపూర్‌

పెద్దల ఆలోచనల్లో మార్పు

నిర్మల్‌టౌన్‌: మహిళలు విశ్వ విజేతలుగా నిలిచి అందరి మనసులు గెలుచుకున్నారు. ఈ విజయంతో పెద్దల ఆలోచనల్లో గణనీయమైన మార్పు వస్తుంది. అమ్మాయిలు క్రికెట్‌ ఆడతామంటే ప్రోత్సహించేలా చేశారు. నాది నిర్మల్‌ మండలంలోని మేడిపల్లి గ్రామం. ప్రస్తుతం సోన్‌ కస్తూరిబాలో పదో తరగతి చదువుతున్నాను. జిల్లా, రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీల్లో పాల్గొంటున్నా. – పోతుగంటి భువన

కొత్త వారికి ఆదర్శం

నిర్మల్‌టౌన్‌: మాలాంటి వారికి, కొత్తగా క్రీడలు ఆడేవారికి మహిళలు సాధించిన ప్రపంచ కప్‌ టైటిల్‌ ఆదర్శం. క్రికెట్‌పై మక్కువ ఉన్న మహిళలకు ఈ విజయం స్ఫూర్తినిచ్చింది. మాది నిర్మల్‌ జిల్లా భైంసా మండలం మహాగాం గ్రామం. అండర్‌ 14, 16 రాష్ట్రస్థాయిలో ఆడాను. ప్రస్తుతం హైదరాబాద్‌ లీగ్‌లో ఆడుతున్నాను. జాతీయస్థాయిలో స్థానం సంపాదించాలన్నదే నా లక్ష్యం. – కోమల్‌

మంచి బ్యాటర్‌ అవుతా..

ఆదిలాబాద్‌: వరల్డ్‌ కప్‌లో స్మృతి మందాన చాలా బాగా ఆడింది. మందాన ఆటను చూసి ఎంతగానో నేర్చుకున్నాను. ఆమె లాగా మంచి బ్యాటర్‌ అవుతా. ప్రతీరోజు అకాడమీలో శ్రమిస్తున్నాను. – వినమ్ర, ఆదిలాబాద్‌

ఒకప్పుడు ‘క్రికెట్‌ అంటే మగవారి ఆట’ అని చెప్పిన సమాజం, ఇప్పుడు మహిళల పోరాటం చూసి సలాం చేస్తోంది. సంవత్సరాల కృషి, పట్టుదల, ప్రతీ ఓటమిని పాఠంగా తీసుకున్న ధైర్యం.. ఇవన్నీ కలిసి ఆదివారం భారత మహిళల క్రికెట్‌ జట్టును చరిత్ర సృష్టించే స్థితికి చేర్చాయి. ముంబైలో జరిగిన ఫైనల్‌ పోరులో టీమిండియా దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఈ గెలుపు క్రీడారంగంలో సువర్ణాక్షరాలు లిఖించింది. మహిళా క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచింది. ఉమ్మడి జిల్లాల యువతులు, విద్యార్థినులు ఈ విజయాన్ని తమ ప్రేరణగా తీసుకుంటామంటున్నారు. పలువురు మహిళా క్రీడాకారులు, విద్యార్థినులు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. – సాక్షి నెట్‌వర్క్‌

మహిళా శక్తి చాటారు

ఆసిఫాబాద్‌రూరల్‌: భారత మహిళా క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ గెలిచి వారి ప్రతిభ, క్రీడాశక్తిని ప్రపంచానికి చూపించారు. నేను సైతం వారి క్రీడా స్ఫూర్తితో జాతీయ స్థాయిలో హ్యాండ్‌బాల్‌ పోటీల్లో రాణిస్తా. – ఆడే పల్లవి, 10వ తరగతి

యువ క్రీడాకారులకు ప్రేరణ

ఆసిఫాబాద్‌రూరల్‌: ఈ విజయం మా వంటి యువ క్రీడాకారిణులకు గొప్ప ప్రేరణ ఇస్తుంది. నేను ఇలాంటి విజయం సాధించడానికి కృషి చేస్తున్నా. జాతీయ స్థాయిలో హ్యాండ్‌బాల్‌లో కాంస్య పతకం సాధించాను. గోల్డ్‌ మెడల్‌ సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నా. – సిడెం అనిత, 10వ తరగతి

సొంతగడ్డపై విజయం ప్రత్యేకం

ఆసిఫాబాద్‌రూరల్‌: భారత మహిళల స్వప్నం సాకారమైంది. ఆఖరి పోరాటంలో సొంతగడ్డపై భారత జట్టు విజయం సాధించడం ఎంతో ప్రత్యేకమైంది. యావత్తు భారత వనితలు గర్వించాల్సిన విజయమిది. నేను ఖోఖోలో 7 సార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఈ విజయం స్ఫూర్తితో జాతీయ స్థాయిలో గోల్డ్‌ మెడల్‌ సాధిస్తా.

– నాగేశ్వరి, గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల

భారత జట్టుకు ఆడుతా..

ఆదిలాబాద్‌: చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టం. నా ఆసక్తిని గమనించి మావాళ్లు అకాడమీలో చేర్పించారు. మొదట్లో కొంత బెరుగ్గా ఉండేది. మ్యాచ్‌లు చూస్తూ, ప్రతీరోజు అకాడమీలో శిక్షణ తీసుకుంటుండడంతో భయం పోయింది. మహిళా జట్టు కప్‌ గెలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది.

– ఆద్య, ఆదిలాబాద్‌

ఆదర్శంగా తీసుకుంటా..

ఆసిఫాబాద్‌రూరల్‌: మహిళా జట్టు ప్రదర్శనను ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో రాణిస్తాను. మా క్రీడా పాఠశాలలో మా కోచ్‌లు క్రీడల్లో రాణించేందుకు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. వారి ప్రోత్సాహంతో క్రీడల్లో విజయాలు సాధిస్తాం.

– నందిని, 10వ తరగతి

దీప్తి ప్రదర్శన అద్భుతం..

ఆసిఫాబాద్‌రూరల్‌: ఫైనల్‌ మ్యాచ్‌లో దీప్తి శర్మ ప్రదర్శన చాలా బాగుంది. కీలక మ్యాచ్‌లో 58 పరుగులతో పాటు బౌలింగ్‌తో 5 వికెట్లు తీసింది. ఆమె కృషి ప్రేరణగా నిలుస్తోంది. జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో మూడు సార్లు పాల్గొన్నాను. – శ్రీలత, 9వ తరగతి

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!1
1/12

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!2
2/12

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!3
3/12

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!4
4/12

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!5
5/12

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!6
6/12

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!7
7/12

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!8
8/12

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!9
9/12

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!10
10/12

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!11
11/12

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!12
12/12

చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement