పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడులు
దహెగాం: మండలంలోని బీబ్రా గ్రామం శివారులో పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారంతో సోమవారం దాడులు నిర్వహించినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ఐదుగురిని పట్టుకున్నామన్నారు. రూ.5,940 నగదు స్వాధీనం చేసుకొని మొహ్మద్ అర్షద్, నిట్టూరి దుర్గేశ్, దుర్గం సాయికుమార్, మల్లబోయిన ఇస్తారి, నైనీ వెంకటిలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఎస్సై రాజు, సిబ్బంది మహమ్మద్, విజయ్, రమేశ్ ఉన్నారు.


