ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోగా యువరాజ్ మర్మట్
ఉట్నూర్‌రూరల్: ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోగా ఉట్నూర్ సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మట్‌ను నియమిస్తూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఈ నెల 4వ తేదీ నుంచి ఆరు నెలల పాటు మెటర్నిటీ సెలవులో వెళ్లనున్నారు. దీంతో ఇన్‌చార్జి పీవోగా ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
బాసరలో గంగాహారతి
బాసర: కార్తిక మాసం రెండో సోమవారం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యగోదావరి హారతితో పాటు గోదావరి తీరంలో విశేష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గోదావరి నదికి హారతినిచ్చి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కాగా కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి నది వద్ద ఈనెల 5న ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో అంజనదేవి తెలిపారు.
ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోగా యువరాజ్ మర్మట్


