పీఎఫ్ బకాయి చెల్లింపు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నస్పూర్ మున్సిపల్ కార్మికుల పెండింగ్ ఈపీఎఫ్(ఉద్యోగ భవిష్య నిధి)ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మరోమారు చెల్లించింది. బకాయిలపై గతంలో రూ.30లక్షలు చెల్లించగా.. మంగళవారం మరో రూ.44లక్షలు చెల్లించారు. మొత్తంగా ఇప్పటివరకు రూ.74లక్షల వరకు కార్మిక శాఖకు కట్టారు. పూర్తిగా రూ.2.50కోట్ల వరకు బకాయిలు ఉండగా కార్పొరేషన్ వాటిని తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గతంలో నస్పూర్ మున్సిపాలిటీ కమిషనర్లు సకాలంలో 128మంది కార్మికులకు సంబంధించి నెల నెలవారీగా డబ్బులు చెల్లించకపోవడంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. కార్మిక శాఖ గత ఏడేళ్లుగా ఇప్పటివరకు ఆయా కార్మికులకు నెల నెలా చెల్లించాల్సిన పీఎఫ్ చెల్లించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో మొదట 2018నుంచి 2021వరకు రూ.1.05కోటిపైగా ఉండగా, 2021నుంచి ప్రస్తుత నెల వరకు మరో రూ.కోటిన్నర వరకు బకాయిలు ఉన్నాయి. నెల నెలా ఆ మొత్తం పెరుగుతూ వస్తోంది. దీనిపై నస్పూర్ పరిధిలోనే అప్పటి మున్సిపల్ అధికారులకు పలుమార్లు నోటీసులు జారీ చేయడం, బ్యాంకు ఖాతా ఫ్రీజ్ చేయడం వంటివి చేసినా స్పందించలేదు. చివరకు కార్పొరేషన్‌లో విలీనమయ్యాక కూడా ఆ బకాయిల చెల్లింపులు చేయాల్సి వస్తోంది. మరోవైపు కార్పొరేషన్ బ్యాంకు ఖాతాను సైతం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసి హెచ్చరించారు. దీంతో తప్పని పరిస్థితుల్లో కార్మిక శాఖకు చెల్లించాల్సి వస్తోంది. ఇక జరిమానాలు, వడ్డీలు సైతం చెల్లించాల్సి వస్తే ఇంకా అధిక మొత్తంలోనే కార్మిక శాఖకు కట్టాల్సి వస్తుంది.
బాధ్యులను వదిలేస్తారా?
గతంలో కార్మిక శాఖకు కార్మికులకు సంబంధించి నెల నెలా చెల్లించాల్సిన పీఎఫ్‌తోపాటు ఈఎ స్‌ఐని సకాలంలో చెల్లించకుండా నిర్లక్ష్యం చేశా రు. దీంతో రూ.కోట్లు బకాయి పడేలా చేసిన అప్పటి అధికారులపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నా యి. ఇప్పటికే వీరి పరిధిలో ముగ్గురు కార్మికులు చనిపోయారు. వీరికి పీఎఫ్ చెల్లించకపోవడంతో కార్మిక బీమా వర్తించకుండా ఆ మొత్తాన్ని కోల్పోయారు. కొంతమంది సర్వీస్ ముగిసిపో యి, నిబంధనల మేరకు చెల్లించే మొత్తాన్ని కో ల్పోయారు. వీటితోపాటు ఇతర సౌకర్యాల కింద పింఛన్ వంటి డబ్బులు పొందలేక బాధిత కార్మిక కుటుంబాలు దూరమయ్యారు. గత ఏడేళ్లుగా ఆయా పీఎఫ్ పథకంతోపాటు ఈఎస్‌ఐ లేకపోవడంతో కార్మికుల ఆరోగ్య రక్షణ, చికిత్సలకు అవకాశం లేకుండా పోయింది. మళ్లీ ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే రెగ్యులర్‌గా అన్ని సౌకర్యాలు పొందవచ్చు. అప్పటి అధికారులు కార్మికులతో పని చేయించుకుని వారికి కనీస సౌకర్యం పొందకుండా చేసిన వారిపై చర్యలు తీసుకోవా లని కార్మిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


