పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
తాండూర్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అర్ధవార్షిక, వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీసీఈబీ సెక్రెటరీ మహేశ్వర్‌రెడ్డి సూచించారు. ఇటీవల అర్ధవార్షిక పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో మంగళవారం మండలంలోని బోయపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, విద్యాభారతి పాఠశాల పరీక్ష కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రశ్నపత్రాలను ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు. ప్రశ్నపత్రాల పంపిణీ తీరు, పరీక్షల నిర్వహణను క్షు ణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల ప్రతిభ ను వెలికితీతకు నిర్వహించే ఈ పరీక్షలను పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఎంఈఓ మల్లేశం, విద్యాభారతి విద్యాసంస్థల కరస్పాండెంట్ సురభి శరత్‌కుమార్ పాల్గొన్నారు.


