 
															‘మహా’ ధాన్యం వ్యాన్ పట్టివేత
కోటపల్లి: మహారాష్ట్ర నుంచి వరి ధాన్యం జిల్లాలోకి తరలిస్తు న్న వ్యాన్‌ను తెలంగాణ సరిహద్దులోని రాపన్‌పల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ‘జిల్లాకు ‘మహా’ ధాన్యం!’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. చెక్‌పోస్టు వద్ద పోలీ సులు వాహనాల తనిఖీ చేపట్టారు. మహారా ష్ట్రలోని సిరొంచ తాలూ కా నగురం గ్రామానికి చెందిన బూర్తి మల్ల య్య చెన్నూర్ పట్టణంలో ని ఓ మిల్లుకు 254 వడ్ల బస్తాలను అక్రమంగా వ్యాన్‌లో తరలిస్తుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి సివిల్ సప్లయ్ అధికారుల కు అప్పగించినట్లు ఎస్సై రాజేందర్ తెలిపా రు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులో 24గంటలు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని, అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
స్పందన
 
							‘మహా’ ధాన్యం వ్యాన్ పట్టివేత

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
