 
															చిరుత సంచారం
ముధోల్: మండల కేంద్రంలోని కంటి ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారిపై చిరుత సంచారం కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి అటుగా వెళ్లిన వాహనదారులకు చిరుత కనిపించింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కృష్ణ బుధవారం ఉదయం చిరుత సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించారు. రోడ్డు పక్కన వ్యవసాయ చేనులో చిరుత పాదముద్రలు లభ్యమయ్యాయి. చిరుత ముధోల్, తరోడా శివారుల్లో సంచరిస్తున్నందున రైతులు ఒంటరిగా చేలోకి వెళ్లొద్దని, గుంపులుగా, చేతిలో కర్రలతో వెళ్లాలని సూచించారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు.
తాంసి(కే)లో పెద్దపులి
సంచారం
భీంపూర్: మండలంలోని తాంసి(కే) గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో బుధవారం పులి సంచరించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో భయాందోళనలకు గురై పరుగులు తీసినట్లు వారు పేర్కొన్నారు. ఈ మేరకు అటవీశాఖ అధికారి హైమద్‌ఖాన్‌ను సంప్రదించగా.. పులి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
కడెం గేట్ల లీకేజీలకు మరమ్మతులు
కడెం: కడెం ప్రాజెక్ట్ వరద గేట్ల లీకేజీలను అరికట్టేందుకు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. లీకేజీల రూపంలో వృథాగా నీళ్లు పోకుండా ఉండేందుకు గేట్ల కింది భాగంలో కాటన్ వేస్ట్ అమర్చుతున్నారు. ప్రస్తుతం 12 గేట్ల లీకేజీ మరమ్మతులు పూర్తయినట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు.
 
							చిరుత సంచారం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
