 
															వైన్స్‌షాప్‌లో చోరీ.. ముగ్గురు రిమాండ్
బేల: బేలలోని కనకదుర్గ వైన్స్‌షాప్‌లో ఈ నెల 27 అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డ ముగ్గురిని రిమాండ్ చేసినట్లు జైనథ్ సర్కిల్ సీఐ శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడారు. చోరీపై వైన్స్ నిర్వాహకుడు రవీందర్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి సీసీ ఫుటేజీలను పరిశీలించామన్నారు. వైన్స్‌షాపు వెనుక భాగాన ఉన్న వెంటిలెటర్ నుంచి వైన్స్‌లోపలకు ప్రవేశించి రూ.13,400విలువ గల మద్యంతో పాటు రూ.41,930 నగదును ముగ్గురు చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. చోరీకి పాల్పడిన బేలకు చెందిన పుసాం నారాయణ, షిండే అజయ్, టేకం జోష్వలను స్థానిక గణేశ్ గార్డెన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి నుంచి రూ.10,320 విలువ గల మద్యం బాటిళ్లతో పాటు రూ.38,630 నగదు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రణాళిక బద్ధంగా దొంగతనం చేసి నగదును వ్యక్తిగత వినోదాలకు వినియోగించినట్లు గుర్తించామన్నారు. సమావేశంలో ఎస్సై ఎల్. ప్రవీణ్, ఏఎస్సై కనక జీవన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
