 
															ఆల్ ఇండియా యూనివర్సిటీ పోటీలకు ఎంపిక
మంచిర్యాలఅర్బన్: కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 26 నుంచి 28 వరకు జరిగిన సాఫ్ట్‌బాల్ అంతర్‌జిల్లా యూనివర్సిటీ టోర్నమెంట్‌లో మిమ్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మంచిర్యాల జట్టు రన్నర్స్‌గా నిలవగా ఇందులో డానియల్, కమల్‌రాజ్, ప్రదీప్, అభినవ్‌లు కాకతీయ యూనివర్శిటీ జట్టు నుంచి ఆల్ ఇండియా యూనివర్శిటీ పోటీలకు ఎంపికయ్యారు. పంజాబ్ యూనివర్సిటీలో డిసెంబర్ 12న జరిగే పోటీల్లో వీరు పాల్గొననున్నారు. క్రీడాకారులను పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరాజు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్‌రావు, డైరెక్టర్ విజయ్‌కుమార్, పీడీ శ్రీని వాస్‌లు అభినందించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
