ఐదెకరాల్లో వరి పంట సాగు చే శా. పొట్ట దశకు వచ్చింది. ఇటీవ ల కురిసిన భారీ వర్షానికి వరి నేలవాలింది. నోటికాడికి వచ్చిన పంట కళ్లముందే నాశనమైంది. పంట కోసం చేసిన అప్పు తీరే పరిస్థితి లేదు. నష్టపోయిన పంటకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
–టి.రాజయ్య, రైతు, చెన్నూర్
పత్తి సర్వనాశనమైంది..
ఈ ఏడాది పత్తి రైతులను ప్రకృతి పగబట్టింది. వరుస వర్షాలతో పత్తి పంట తీ వ్రంగా దెబ్బతింది. ఎకరానికి పది నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాలి. వర్షాల కారణంగా ఎకరానికి రెండు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం లేదు. వర్షాలకు అప్పులే మిగిలే అవకాశం ఉంది. –మహేశ్, రైతు, చెన్నూర్
పొట్టకచ్చింది..


