బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దు
తాండూర్: పారిశుద్ధ్య సమస్య తలెత్తే విధంగా బహిరంగ ప్రదేశాలు, జనావాసాల మధ్య చెత్త వేస్తే ఉపేక్షించబోమని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు హెచ్చరించారు. మంగళవారం మండలంలోని తాండూర్ గ్రామ పంచాయతీలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తాండూర్ ఐబీ రోడ్ల పక్కన ఉన్న దుకాణాలను తనిఖీ చేసి రోడ్లపై చెత్త వేసిన పలువురికి జరిమానా విధించారు. అనంతరం తాండూర్ ఐబీ ప్రాథమిక పాఠశాల, ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. ఉద్యోగులు సమయపాలన పాటించాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా, నీటి సమస్యలు లేకుండా శ్రద్ధ వహించాలన్నారు. ఎంపీడీఓ శ్రీనివాస్, పంచాయతీ అధికారి అనిల్, పంచాయతీ కార్యదర్శి దివాకర్ పాల్గొన్నారు.


