కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించా లని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు యాజ మాన్యాన్ని కోరారు. మంగళవారం స్థానిక జీఎం కార్యాలయంలో గుర్తింపు సంఘం, యాజమాన్యం మధ్య ఏరియా స్థాయి స్ట్రక్చర్ సమావేశం నిర్వహించారు. కాలనీలో కార్మికుల క్వార్టర్లకు మరమ్మతులు చేయాలన్నారు. అన్ని కాలనీల్లో రోడ్డు, క్వార్టర్ల నంబ ర్లు సైన్‌బోర్డ్ పై రాయించాలని, ఆర్కే 7 గని లో సపోర్ట్‌మెన్ కార్మికుల కోసం గది నిర్మించాలని కోరారు. ఇన్‌చార్జి జీఎం కురుమ రాజేందర్, ఎస్‌వోటు జీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి షేక్ బాజీసైదా, ప్రతినిధులు కొట్టే కిషన్ రావు, ఎం. కొముర య్య, బద్రి బుచ్చయ్య, నాగభూషణం, ఏజెంట్ శ్రీధర్, డీజీఎంలు అనిల్‌కుమార్, రాజన్న ఆనంద్‌కుమార్, రవీందర్, మల్లయ్య పాల్గొన్నారు.


