
నేడు కల్వరీ ఉపవాసదీక్షల విరమణ
కాసిపేట: మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ శివారులో గురువారం కల్వరీ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉపవాస దీక్షల విరమణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముగింపు ప్రార్థన సమావేశాలకు క్రైస్తవులు అధిక సంఖ్యలో తరలి రానుండడంతో భారీ ఏర్పాట్లు చేశారు. పాస్టర్ ప్రవీణ్ ఉపవాస దీక్షల విరమణ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి క్రైస్తవులు తరలి రావడంతో సోమగూడెం బెల్లంపల్లి ప్రధాన రహదారి జనసంద్రగా మారింది. సుమారు రెండు లక్షల మంది హాజరు కానుండడంతో ముందస్తు ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.