
గంజాయి సాగు చేస్తున్న యువకుడి అరెస్ట్
జైపూర్: గంజాయికి అలవాటు పడిన యువకుడు ఏకంగా ఇంటి సమీపంలోనే మొక్కలు పెంచుతుండడంతో పక్కా సమాచారం మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రామారావుపేట గ్రామానికి చెందిన బొద్దున సత్యనారాయణ అనే యువకు డు గంజాయికి అలవాటు పడ్డాడు. తన ఇంటి స మీపంలోనే గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై శ్రీధర్, తన సిబ్బందితో వెళ్లి తనిఖీ చేశారు. సత్యనారాయణ ఇంటి ఆవరణలో పెంచుతున్న గంజాయి మొక్కలు స్వాధీ నం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు తరలించి చెన్నూర్ కోర్టులో హాజరు పరిచారు. గంజాయి రవాణా చేసినా, విక్రయించినా, సాగు చేసినా కఠినచర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
తిర్యాణి మండలంలో..
ఆసిఫాబాద్‌అర్బన్: తిర్యాణి మండల పరిధిలోని చెలిమెల గ్రామం కొద్దుగూడ శివారులో ఆత్రం పాపారావ్ (32) తన కంది చేనులో గంజాయి సాగు చేస్తుండగా అతడిపై కేసు నమోదు చేసినట్లు తిర్యాణి ఎస్సై వెంకటేశ్ తెలిపారు. 10గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
జైపూర్: గంజాయి మొక్క, నిందితుడితో ఎస్సై
ఆసిఫాబాద్‌అర్బన్: పోలీసుల అదుపులో నిందితుడు

గంజాయి సాగు చేస్తున్న యువకుడి అరెస్ట్