
పేగు బంధానికి వీడ్కోలు
కొడుకు చితికి నిప్పు పెట్టిన తల్లి
తాండూర్: జీవిత చరమాంకంలో తనకు తలకొరివి పె ట్టి నరకం నుంచి తప్పిస్తాడనుకున్న ఆ కొడుకుకు కన్న తల్లే తలకొరివి పెట్టింది. ఈ విషాద ఘటన మండలంలోని మాదారం టౌన్‌షిప్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. వివరా లు.. మాదారం టౌన్‌షిప్ గ్రామానికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికురాలు సలాకుల రాజమ్మకు రమేశ్, నరేశ్ ఇద్దరు కుమారులున్నారు. వీరిలో రమేశ్ ఏడా ది క్రితమే అనారోగ్యంతో మరణించాడు. ఆ విషా దం నుంచి ఇంకా తేరుకోకముందే ఆ తల్లిని మరో చేదు వార్త వెంటాడింది. చిన్న కుమారుడు నరేశ్ కూడా ఫిట్స్‌తో గురువారం మృతి చెందాడు. దీంతో ఆమె అంతులేని శోకాన్ని అనుభవించాల్సిన పరి స్థితి నెలకొంది. శుక్రవారం నరేశ్ అంత్యక్రియలు నిర్వహించగా తల్లి రాజమ్మే కుండపట్టి కొడుకును కాటివరకు సాగనంపింది. తీవ్ర దుఃఖాన్ని దిగమింగుతూ కొడుకు చితికి నిప్పంటించి పేగు బంధానికి కన్నీటి వీడ్కోలు పలికింది. రాజమ్మ రోధించిన తీరుకు పలువురు కంటతడి పెట్టుకున్నారు. నరేశ్‌కు భార్య, కుమార్తె ఉంది. ఏడాది వ్యవధిలోనే రాజమ్మ ఇద్దరు కుమారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పేగు బంధానికి వీడ్కోలు