
డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌పై దాడి
కాగజ్‌నగర్ రూరల్: మండలంలోని రాస్పెల్లి శి వారు అటవీ భూమి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బాబు పాటేకర్, అటవీశాఖ సిబ్బంది పట్టుకున్నారు. వాటిని రాస్పెల్లి నుంచి కాగజ్‌నగర్ రేంజ్ కార్యాలయానికి తరలిస్తున్న క్ర మంలో ట్రాక్టర్ యజమాని నాసిద్‌అలీ ఖాన్ అ డ్డుకుని ఫారెస్ట్ అధికారులతో వాగ్వాదానికి ది గాడు. తాను పట్టా భూముల నుంచి మాత్రమే ఇసుక తరలిస్తున్నానని, అది అటవీ ప్రాంతం కాదని వాదించాడు. అయితే నాసిద్‌అలీ ఖాన్ తమ విధులకు ఆటంకం కలిగించడంతో పా టు తనపై దాడి చేశారని డిప్యూటీ రేంజ్ ఆఫీస ర్ బాబుపాటేకర్ ఈజ్‌గాం పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఈ మేరకు నాసిత్‌అలీఖాన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈజ్‌గాం ఎ స్సై కల్యాణ్ తెలిపారు. పట్టుకున్న ఆరు ట్రాక్టర్లను రేంజ్ కార్యాలయానికి తరలించారు.
మద్యానికి బానిసై పురుగుల మందు తాగి ఆత్మహత్య
అన్నం పెట్టినోడికే కన్నం..
ఆదిలాబాద్‌టౌన్: అన్నం పెట్టినోడికే కన్నం పె ట్టిన సామెత ఈ ఘటనకు అద్దం పడుతోంది. ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్‌కు చెందిన జీ అశోక్ ఇంటి సమీపంలో అపరిచిత వ్యక్తి శుక్రవారం కూర్చొని ఉన్నాడు. అతడి వద్దకు వెళ్లిన అశోక్ ఇక్కడ ఏం చేస్తున్నావని అడగగా, తనకు ఆకలి అవుతోందని అన్నం పెట్టమని కోరాడు. దీంతో బాధితుడు తన ద్విచక్ర వాహనాన్ని నడపమని చెప్పి తాను వెనుక కూర్చున్నాడు. తెలంగాణ చౌక్ ప్రాంతంలో మద్యం తాగించి భోజనం చేయించాడు. ఈ క్రమంలో అశోక్ అక్కడే ఉండగా నిందితుడు బైక్ తీసుకుని పారిపోయాడు. సీసీ ఫుటేజ్‌లో ఈ దృశ్యం రికార్డయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ వివరించారు.