
హైరిస్క్ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి
మంచిర్యాలటౌన్: మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో హైరిస్క్ పిల్లలకు వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పిల్లల ఆరోగ్య స్థితిని ప్రతీరోజు తల్లిదండ్రులకు వివరించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత అన్నారు. బుధవారం ఆమె ఎంసీహెచ్‌ను సందర్శించి పిల్లలకు అందిస్తున్న వైద్య సేవలు, వ్యాక్సిన్ కేంద్రం పరిశీలించారు. వ్యాక్సిన్ నిల్వలు సిద్ధం చేసుకోవాలని, ప్రతీ బుధ, శనివారాల్లో అన్ని ఆరోగ్య ఉపకేంద్రాల్లో పిల్లలకు వ్యాక్సిన్ వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీహెచ్‌ఎన్ పద్మ, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
పైలేరియా రక్తపరీక్షల కిట్ల వినియోగంపైఅవగాహన
మంచిర్యాలటౌన్: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం పైలేరియా నియంత్రణకు ఈ నెల 13నుంచి జిల్లావ్యాప్తంగా చేపట్టనున్న సర్వేలో రక్తపరీక్ష కిట్ల వినియోగంపై అవగాహన కల్పించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ అనిత, జోనల్ మలేరియా అధికారి డాక్టర్ సునిల్‌కుమార్ జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్లకు కిట్ల వినియోగంపై వివరించారు. ఈ కార్యక్రమంలో కీటక జనిత వ్యాధుల కన్సల్టెంట్ సైదులు, నాగయ్య, డీపీవో ప్రశాంతి, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు.