
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
నస్పూర్: గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలుపర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ విమర్శించారు. పట్టణ పరిధిలోని జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన చెన్నూర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ బాకీ కార్డును అమలుపర్చాలని అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని తెలి పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసిన వారికే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో అభ్యర్థులను ఆయా పరిధిలోని గ్రామాల వారీగా సమీక్షించి ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.