
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి
బెల్లంపల్లి: నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సా రించి శాంతిభద్రతలు పరిరక్షించాలని రామగుండం పోలీసు కమిషనర్(సీపీ) అంబర్‌కిశోర్ ఝా అ న్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం బె ల్లంపల్లి టూటౌన్‌ను సందర్శించారు. స్టేషన్ పరిధి లో నేరాలు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యల పై తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సీపీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏ ర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నే రాలకు పాల్పడే వారిని గుర్తించడంలో సీసీ కెమెరా లు కీలకంగా పనిచేస్తాయని అన్నారు. ఎస్సై చిలు ముల కిరణ్‌కుమార్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ఏ.రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ పాల్గొన్నారు.