
సీపీఐ జాతీయ సమితి సభ్యుడిగా కలవేన శంకర్
పాతమంచిర్యాల: సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా కలవేన శంకర్ ఎన్నికయ్యారు. ఈ నెల 21 నుంచి 25వరకు ఛండీఘడ్‌లో పార్టీ 25వ జాతీయ మహాసభలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయనను మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్ నుంచి మొదలుకొని సింగరేణి కాలరీస్ వర్క ర్స్ యూనియన్‌లో కార్మికులు, కార్మికేతరులు, ప్రతీ ఇంటికి నీటి వసతి, శ్రీరాంపూర్‌లో కార్మికులకు సింగరేణి సంస్థ ఉచిత విద్యుత్ తదితర అంశాలపై పోరాటం చేశారు. శంకర్‌ను పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మ ణ్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు అభినందించారు.