
కుటుంబ విలువల పరిరక్షణకు నడుం బిగించాలి
భీమారం: కుటుంబ విలువల పరిరక్షణకు ప్రతీ హిందువు నడుం బిగించాలని ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా ప్రధాన వక్త ఉప్పల రూపాచారి అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా గురువారం మండల కేంద్రంలో విజయదశమి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్లుగా రాజ్యాంగబద్ధంగా దేశ అభ్యున్నతి కోసం పనిచేస్తోందని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ జన్మశతాబ్దిలో భాగంగా రాబో యే రోజుల్లో ఇంటింటి జన జాగరణ చేపట్టబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్తీ ప్రముఖ్ కొట్రంగి రవీందర్, మాదాడి శ్రీధర్‌రెడ్డి, మెండె మల్లేఽశ్ పాల్గొన్నారు.