
‘జీఎస్టీ సంస్కరణలతో పేదలకు లబ్ధి’
చెన్నూర్: పేద, మద్య తగరతి ప్రజలకు లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీఎస్టీ సంస్కరణలకు శ్రీకారం చు ట్టారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. ఉపాధ్యక్షుడి హోదాలో మొదటిసారిగా చెన్నూర్‌కు వచ్చిన ఆయనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో చెన్నూర్, కోటపల్లి నాయకులు ఘన స్వాగతం పలికారు. స్థానిక మహేశ్వరీ భవన్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో రఘునాథ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వి డుదల చేస్తున్న నిధుల వివరాలు ప్రజలకు వివరించాలని అన్నారు. అనంతరం పట్టణంలోని గాంధీ చౌక్‌లో కొత్త జీఎస్టీ అమలు తీరు పై దుకాణాల్లో అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి దుర్గం అశో క్, వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకటేశ్వర్, పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్, ముఖేశ్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.