
బ్యాటరీల చోరీ నిందితుడి రిమాండ్
ఇంద్రవెల్లి: బ్యాటరీలు చోరీ చేసిన నిందితుడిని అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్ తెలిపారు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత జూలై, ఆగస్టులో మల్లాపూర్, పిప్రి గ్రామపంచాయతీల్లో 6, సిరికొండ మండలంలోని కొండపూర్‌లో 3, గుడిహత్నూర్ మండలం రాఘపూర్‌లో 3 టీఫైబర్ బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. టీ ఫైబర్ ఫీల్డ్ మెనేజర్ చిట్యాల రాజు గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్‌కు చెందిన పైతానే ధన్‌రాజ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఆగస్టు 18న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నిందితుడికోసం గాలిస్తున్న పోలీసులు సోమవారం పైతానే ధన్‌రాజ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో బ్యాటరీలను దొంగిలించి గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామానికి చెందిన షేక్ రహీంకు విక్రయించినట్లు చెప్పడంతో అతనిపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.