
జాతీయస్థాయి పోటీలకు రెఫరీగా ‘రిక్కల’
రెబ్బెన: తమిళనాడులోని దిండిగల్‌లో ఈ నెల 24 నుంచి 28 వరకు జరుగనున్న జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు రెఫరీగా రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్‌షిప్‌కు చెందిన రిక్కల వెంకట రామకృష్ణ ఎంపికై నట్లు బ్యాడ్మింటన్ ఆఫ్ ఇండియా చీఫ్ రెఫరీ జ్యోతిష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామకృష్ణను అసోసియేషన్ చీఫ్ పాట్రన్ నారాయణరెడ్డి, అధ్యక్షుడు కొత్తపెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి, సెపక్‌తక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, షార్ప్‌స్టార్ అసోషియేషన్ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు అభినందించారు.
రాష్ట్ర మహిళా జట్టు కోచ్‌గా ఎస్.తిరుపతి
రాష్ట్ర మహిళా జట్టు కోచ్‌గా గోలేటికి చెందిన ఎస్.తిరుపతి ఎంపికై నట్లు అసోసియేషన్ ఉమ్మడి జిల్లా చీఫ్ పాట్రాన్ ఆర్.నారాయణరెడ్డి తెలిపారు.