
మద్యానికి బానిసై మరొకరు..
మంచిర్యాలక్రైం: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సీఐ ప్రమోద్‌రావు తెలిపిన వివరాల మేరకు జిల్లా కేంద్రంలోని పాత గర్మిళ్లకు చెందిన మిల్కూరి లక్ష్మణ్ (34)కు పదమూడేళ్ల క్రితం త్రివేణితో వివాహమైంది. దంపతులకు ఇద్దరు కుమారులు మణిరుధ్, క్రిష్ ఉన్నారు. కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 21న సాయంత్రం అతిగా మద్యం సేవించాడు. జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య త్రివేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.