
అర్జీలు సత్వరం పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: ప్రజావాణిలో వచ్చే అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రాజెక్టు అధికారి చాంబర్‌లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై ప్రజలు నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. తలమడుగు మండలం కాపర్దేవికి చెందిన చిత్రకళ కిరాణా దుకాణం ఇప్పించాలని, ఇచ్చోడకు చెందిన కిరణ్ కుమార్ ట్రైకార్ రుణం మంజూరు చేయాలని, జైనూర్ మండలం పాట్నపూర్‌కు చెందిన ఉత్తమ్ వాటర్ ప్లాంట్ ఇప్పించాలని అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.