
మహా బతుకమ్మ వేడుకలు విజయవంతం చేయాలి
నస్పూర్: తెలంగాణ జాగృతి, హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో ఈనెల 23న సాయంత్రం శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియంలో నిర్వహించనున్న మహా బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధా న కార్యదర్శి నవీన్‌చారి కోరారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేడుకలకు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరుకానున్నట్లు తెలిపారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమావేశంలో కామారెడ్డి జాగృతి జిల్లా కన్వీనర్ సంపత్‌గౌ డ్, సింగరేణి విభాగం అధ్యక్షుడు వెంకటేశ్, నా యకులు ఐద ప్రశాంత్, రత్నాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌గౌడ్, మేడి శేఖర్, బొగ్గుల సాయికృష్ణ, వంశీ, ఈట రాకేశ్, వినయ్ పాల్గొన్నారు.