
అడవిలో చెట్లు నరకడం చట్టవిరుద్ధం
జన్నారం: అడవిలోని చెట్లు నరకడం చట్టవిరుద్ధమని జన్నారం ఫారెస్ట్ డివిజనల్ అధికారి రామ్మోహన్ అన్నారు. ఆదివారం టీడీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కవ్వాల్ టైగర్‌జోన్ కోర్ ఏరియాలో పాలఘోరీల ప్రాంతంలో సర్వే నంబర్ 112లో ఉన్న 9,631 ఎకరాల్లో తమ పూర్వీకుల భూమి ఉందని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూ, జైనూర్, లింగాపూర్ మండలాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు గతనెల 4న గుడిసెలు వేసుకుని ఉంటున్నారన్నా రు. ఇట్టి భూమిపై ఆదివాసీలు ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోగా 2005 డిసెంబర్‌కు ముందు పోడులో ఉన్న వారి వివరాల ప్రకారం 120 ఎకరాలను పంచగా మిగతా భూమి ఫారెస్టులో కలిసిందని అధికా రులు రాతపూర్వకంగా వారికి తెలియజేశారన్నారు. శాంతియుతంగా వారితో మాట్లాడటమే కాకుండా పోలీసు, రెవెన్యూ అధికారులతో పలు మార్లు కౌన్సి లింగ్ కూడా ఇప్పించామన్నారు. అయినా వారిలో మార్పు రాకపోవడమే కాకుండా ఈనెల 18న రూ. 3.50 లక్షల విలువైన 350 టేకుచెట్లను నరికారని, అడ్డుగా వెళ్లిన అటవీ సిబ్బందిపై కారంపొడి చల్లి కర్రలతో దాడికి పాల్పడ్డారన్నారు. వారి పై అటవీ నేరం, వన్యప్రాణుల చట్టం ప్రకారం కేసులు నమో దు చేశామన్నారు. అటవీ సిబ్బందిపై దాడికి పాల్ప డిన 26 మందిని అరెస్ట్ చేసి ఆదివారం తెల్లవారు జామున లక్సెట్టిపేట కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎఫ్‌డీవో పేర్కొన్నారు. సమావేశంలో రేంజ్ అధికారి సుష్మారావు, సిబ్బంది పాల్గొన్నారు.