
ఎంగిలిపూల బతుకమ్మ సందడి
జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మహిళలు, యువతులు పాటలు పాడుతూ రాత్రి వరకు ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మ ఆడారు. జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయం, హైటెక్‌సిటీ కాలనీ, రెడ్డి కాలనీ, ఆదిత్య ఎంక్లేవ్, పాతమంచిర్యాల, హమాలివాడ, చున్నంబట్టివాడ, లక్ష్మీనగర్, రాంనగర్, జన్మభూమినగర్ కాలనీల్లో మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
– మంచిర్యాలటౌన్

ఎంగిలిపూల బతుకమ్మ సందడి