
రక్తదానానికి ప్రజలు ముందుకురావాలి
మంచిర్యాలటౌన్: అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రజలు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు జన్మదినం పురస్కరించుకుని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ఆదివారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు ద్వారా తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తులతో పాటు, గర్భిణులకు ప్రసవ సమయంలో, రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి ప్రతీరోజు దాదాపుగా 30 మందికి రక్తం అందించడం జరుగుతుందన్నారు. శిబిరంలో 1,101 మంది రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. పోలీసు శాఖ సైతం ముందుకు వచ్చిందని, వారి ఆధ్వర్యంలోనూ మెగా శిబిరం నిర్వహిస్తామని, ఇతరులు సైతం రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రక్తదాతలకు ధృవీకరణ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత, దేవాపూర్ అదాని ఓరియంట్ సిమెంట్ కంపెనీ యూనియన్ అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్‌రావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.