
కలప డిపో సీజ్
భీమారం: మండల కేంద్రంలోని రాజలింగు కుటుంబానికి చెందిన ప్రైవేట్ కలప డిపోను మంచిర్యాల అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ రత్నాకర్‌రావు శనివారం సీజ్ చేశారు. ఇప్పటికే కలప వర్క్‌షాప్‌ని సీజ్ చేసిన అధికారులు తాజాగా డిపోను మూసివేశారు. ఇటీవల రిజర్వు ఫారెస్ట్‌లో చింతల ప్రదీప్, మగ్గిడి జీవన్, చింతల రా జ్‌కుమార్‌లు 21 టేకు చెట్లు నరికి స్మగ్లింగ్ చే స్తుండగా సిబ్బంది పట్టుకున్నారు. ఆ టేకు దుంగలను రాజలింగుకి అమ్ముతున్నట్లు నేరం అంగీకరించారు. వాటి విలువ రూ.86,426 వేలు ఉంటుందని, ఈమేరకు కేసు నమోదు చేసినట్లు రేంజ్ ఆఫీసర్ తెలిపారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.