
పోషకాహారలోపం లేని సమాజ నిర్మాణమే లక్ష్యం
చెన్నూర్/తాండూర్: పోషకాహారలోపం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా సంక్షేమ అధికారి రవూఫ్‌ఖాన్ అన్నారు. గురువారం చెన్నూర్, తాండూర్ మండలం కిష్టంపేటలో అంగన్‌వాడీ టీచర్లకు ‘పోషణ్ బీ–పడాయి బీ’ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోషకాహారం, పిల్లల అభివృద్ధి ఫలితాల్లో మెరుగుదల వేగవంతం చేయడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం అన్నారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కౌమార దశలో ఉన్న బాలికలకు మంచి పోషక విలువలు గల పౌష్టికాహారం అందించాలని సూచించారు. అనంతరం 8వ రాష్ట్రీయ పోషణ్ మా ప్రోగాంను ప్రారంభించి, శిక్షణ పూర్తి చేసిన అంగన్‌వాడీ టీచర్లతో ప్రతిజ్ఞ చేయించారు. సీడీపీవోలు మనోరమ, స్వరూపారాణి, పోషణ్ అభియాన్ బ్లాక్ కోర్డినేటర్ నగేశ్, సూపర్‌వైజర్లు కవిత, సువర్ణ, పద్మ, మాధవి, రజిత, రమాదేవి, స్వరూప, పుష్ప పాల్గొన్నారు.